News
అనుకున్న లక్ష్యాలు చేరాం
నీరు-ప్రగతి పథకంపై ఉన్న శ్రద్ధతో 29% వర్షపాతం లోటు ఉన్నా కూడా అనుకున్న లక్ష్యాలు చేరామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం నీరు-ప్రగతిపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటసంజీవని కార్యక్రమం 69% పూర్తయ్యిందని, ఈ వారంలో 3215 పంటకుంటల తవ్వకం జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 1.75 లక్షల పంటకుంటల తవ్వకం పూర్తయ్యిందని, మిగిలినవి కూడా త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సిసి రోడ్ల నిర్మాణం 3037 కి.మీ పూర్తి అయ్యాయని, మిగిలిన 1963 కి.మీ రోడ్ల నిర్మాణం కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏ ఊళ్లో పడిన వర్షంనీరు ఆ ఊళ్లోనే ఇంకేలా చూడాలని, నీరు-ప్రగతి పనులు ముమ్మరంగా నిర్వహించాలన్నారు. ప్రతి శాఖ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, అంగన్ వాడి భవనాలు, మండల పరిషత్ భవనాలు, సిసి రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై అన్ని శాఖలు దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం కేటాయించిన నిధులను పూర్తిగా వ్యయం చేయాలన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








